Sep 19,2023 23:05

ప్రజాశక్తి - రేపల్లె
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన  కల్పిస్తున్నామని అంగన్వాడీ కార్యకర్తలు కె ఝాన్సీరాణి, కె నాగమణి, కె సాయి సుధా తెలిపారు. మండలంలోని బేతపూడి పంచాయతీలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తక్కువ బరువున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నెలరోజుల పాటు ప్రతి ఇంటికి పోషణ, పోషకాహారం, తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం పోషణ నినాదాలతో మారుమోగేలా ప్రచారం చేయాలన్నారు. పిల్లలకు అవసరమైన టీకాలు, పెరటి తోటల పెంపకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు శ్రావణి, వరలక్ష్మి పాల్గొన్నారు.