Sep 15,2021 21:58

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
ప్రజాశక్తి- పిచ్చాటూరు:
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే గర్భిణులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. బుధవారం నారాయణవనం జెడ్‌పి హైస్కూల్‌ (బాలురు)లో జరిగిన పౌష్టికాహార మహోత్సవ కార్యాక్రమాన్ని శిశుసంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెట్లు నాటి ప్రారంభించారు. అనంతరం పలువురు గర్భిణులకు సీమంతం చేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి, ఎంపిడిఓ గంగాభవాని, తహశీల్దార్‌ మధుసూదన్‌ రావు, మెడికల్‌ ఆఫీసర్‌ దక్షిత, సూపర్వైజర్లు, అంగన్వాడీలు, వైసిపి నాయకులు సుదర్శన్‌ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు సోరకాయలు పాల్గొన్నారు.
ఏర్పేడు: ఎండి పుత్తూరు గ్రామంలో శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ మోహనప్రియ పోషకాహారం. పోషక విలువలు కలిగిన ఆహారం గురించి గర్భిణులకు సూచనలిచ్చారు. ఉపసర్పంచ్‌ గౌరి, సిడిపిఓ శాంతి దుర్గ, కోటీశ్వరి,ప్రగతి చంద్రశేఖర్‌, మహిళా పోలీస్‌ ప్రియదర్శిని, అంగన్వాడీలు విమల కుమారి, కమలమ్మ హెల్పర్‌ మల్లీశ్వరి పాల్గొన్నారు.