Jul 29,2021 20:45

మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురంరూరల్‌ : పర్యావరణ పరిరక్షణకు మూలాధారం, జీవకోటికి ప్రాణాధారమైన చెట్లను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. గురువారం ఐఆర్‌పిడబ్ల్యూఎ స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని సబ్‌ కలెక్టర్‌ భావన, ఎపి టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బోను గౌరీశ్వరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పిడి, సిబ్బంది, ఐఆర్‌పిడబ్ల్యు ప్రతినిధులు ప్రకాష్‌, గణేష్‌, ప్రజలు పాల్గొన్నారు.