
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా 5.34 కోట్లకు తగ్గి 10 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కరోనా, లాక్డౌన్ నిబంధనలు ఈ రంగాన్ని భారీగా దెబ్బతీశాయి. 2010ా11లో అత్యల్పంగా 5.38 కోట్ల ప్రయాణికులు నమోదయ్యారు. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా పేర్కొంది. గడిచిన ఫిబ్రవరి, మార్చిలో ఈ రంగం కొంత పుంజుకున్నప్పటికీ.. మళ్లీ కరోనా విజృంభించడంతో ఈ రంగంపై తిరిగి నీలినీడలు కమ్ముకున్నాయి.