May 14,2022 08:16

ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి : పది పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారంలో అరెస్టయిన ఏడుగురికి చిత్తూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత నెల 27వ తేదీ తెలుగు పరీక్షల నిర్వహణలో భాగంగా పేపర్‌ లీక్‌ అయిన విషయం విదితమే. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఐదుగురు ప్రయివేటు ఉపాధ్యాయులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు పంపారు. వీరందరికీ బెయిల్‌ మంజూరు చేస్తూ చిత్తూరు కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.