
ప్రజాశక్తి-చీరాల: విద్యారంగంలో ఉత్తమ ప్రతిభావంతులను గుర్తిస్తూ వాళ్లకు చేయూతను అందించడంలోనూ, సేవా కార్యక్రమాలలోనూ రోటరీ క్లబ్ అన్ని వేళలా ముందుంటుందని క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను రోటరీ క్లబ్ ప్రతినిధులు స్థానిక రోటరీ కమిటీ హాల్‌లో సత్కరించి చేయూతను అందించారు. విజయనగర కాలనీకి చెందిన వంటరి ప్రవళిక పెరిరాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదువుతూ 10వ తరగతి పరీక్షలలో 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించింది. పట్టణంలోని మునిసిపల్ గరల్స్ హైస్కూల్ బాలిక 584 మార్కులు సాధించిన బసవ భావనలను శాలువాలతో ఘన సన్మానం చేసి, సర్టిఫికెట్స్, నగదు బహుమతులు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వలివేటి మురళీకృష్ణ, గుర్రం రాఘవరావు, డివి సురేష్, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పోలుదాసు రామకృష్ణ, చీరాల కృష్ణమూర్తి, డి హేమంత్ కుమార్, సత్యనారాయణ, సుభాషిణి, లలితకుమారి, నళిని, లక్ష్మి, రోటరీ, ఇన్నర్ వీల్ ప్రతినిధులు, టీచర్స్ పాల్గొన్నారు.