
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నాయకులు
వేపాడ : టిడిపి సీనియర్ నాయకులు జాగరపు పెదరామునాయుడు మరణం పార్టీకి తీరని లోటని టిడిపి నియోజకవర్గం నాయకులు గొంప కృష్ణ అన్నారు. మండలంలోని సోంపురంలో ఆదివారం పెద్ద రామునాయుడు సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, నాయకులు గుమ్మడి భారతి, సోంపురం సర్పంచ్ మురిపిండి గంగరాజు, మంచిన అప్పలసూరి, గొర్లె నాగరాజు, లగుడు రవికుమార్, లంక శ్రీను, రెడ్డి పైడి బాబు, సిరికి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.