Oct 17,2020 12:42

హైదరాబాద్‌ : హీరోయిన్‌ సమంత... తన పెద్ద మనసును చాటుకుంది. ఆమె ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు కూడా భాగ్యనగరంలో ఉన్న పేద ప్రజల ఆకలి తీర్చుతోంది. కరోనా విలయ తాండం ఒక వైపు అయితే మరోవైపు వర్షాలు, వరదలతో భాగ్యనగర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటమునిగిన ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లే ఎక్కువ. పేద ప్రజల దుస్థితిని చూసి కదలిపోయిన సమంత ప్రత్యూష ఫౌండేషన్‌.. డిగ్నిటీ డ్రైవ్‌ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. వాలంటీర్ల సహయంతో ఆహారాన్ని వండి.. ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేసింది. వలంటీర్లు ఆహారాన్ని వండుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. హ్యాట్సాఫ్‌ టు సమంత...!