Oct 03,2022 22:53

చేయూత చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, మండల ప్రజా ప్రతినిధులు


ప్రజాశక్తి - తాళ్ళరేవు
పేద ప్రజల అభివృద్ధే నిజమైన అభివద్ధి అని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ అన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి లేదు అని అంటున్న ప్రతిపక్ష నేతలకు సతీష్‌ కుమార్‌ ఘాటుగా సభ ద్వారా సమాధానమిచ్చారు. తాళ్లరేవు లో రాయుడు గంగాధర్‌ అధ్యక్షతన జరిగిన చేయూత సభలో ఆయన మాట్లాడారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభించారు. మండలంలో 5389 మందికి మంజూరైన రూ.10 కోట్ల 10 లక్షల 43 వేల 750 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి దొమ్మేటి సాగర్‌, కుడుపూడి శివన్నా రాయణ, దున్నా జనార్దన రావు, వైస్‌ ఎంపిపిలు ధూళిపూడి నాగేంద్రప్రసాద్‌, కొపనాతి లలిత, ఎంపీడీఒ ఎం. అనుపమ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.