Jan 17,2022 21:57

జ్యోతిబసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పిస్తున్న పిఎస్‌.రాధాకృష్ణ, డి.గౌస్‌దేశారు తదితరులు

- వర్ధంతి సభలో సిఐటియు నాయకులు
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌:
 సిఐటియు వ్యవస్థాపక ఉపాధ్యక్షులు జ్యోతి బసు 33 సంవత్సరాలు అవిశ్రాంతంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసి 13 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసి పేదల పక్షపాతిగా పేరు గాంచారని సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు పిఎస్‌.రాధాకృష్ణ, డి.గౌస్‌దేశారు తెలిపారు. సోమవారం కార్మిక కర్షక భవన్‌లో జ్యోతిబసు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధ ఫాసిస్టు విధానాన్ని ఎదురించి విజయం సాధించిన వీర యోధుడు పశ్చిమ బెంగాల్‌ ప్రజల ఆశాజ్యోతి అన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఆయన వదిలివెళ్లిన కష్టజీవుల రాజ్యాన్ని సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులు అర్పించినట్లని అన్నారు. అందువల్ల కష్టజీవులను ఐక్య మరచి ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. ఏడు సంవత్సరాల మోడీ పాలనలో కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టి దేశంలో నిరుద్యోగ సమస్యను, ఆర్థిక సంక్షోభాన్ని పెంచి పోషించా రన్నారు. ఇది చాలదన్నట్లు వ్యవసాయరంగాన్ని కూడా మూడు వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేయాలనుకున్నారన్నారు. ఏడాదిపాటు రైతులు వీరోచితంగా పోరాటం చేసి ఆ నల్ల చట్టాలను రద్దు చేయించారన్నారు. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇ.పుల్లారెడ్డి, ఎండి.అంజిబాబు, ప్రభాకర్‌ ,విజరు, వీరన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.రమీజాబీ పాల్గొన్నారు.