ప్రజాశక్తి - కాజులూరు
పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రజలకు వివరించారు. సోమవారం మండలంలోని ఒంటితాడి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి వేణుగోపాలకష్ణ గడపగడపకు వెళ్లి పేదల సంక్షేమం లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు ఇళ్లవద్దే అందుతున్నాయన్నారు. రైతులకు విత్తు నాటిన నాటి నుంచి విక్రయం వరకు ప్రతీ దశలోను సేవలందిస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. మంత్రి వెంట ఎంపిటిసి డి.భీమేశ్వరరావు, సర్పంచ్ బ్రహ్మాజీ, తహసీల్దార్ సత్య నారాయణ, ఎంపిడిఒ ఇందిరాదేవి, పంచాయతీ కార్యదర్శి సూరిబాబు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ