Oct 03,2022 02:42
మందుల షాపును ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య

ప్రజాశక్తి-పంగులూరు: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ఖరీదుగా మారిందని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందువల్ల పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మందులను వారికి అందుబాటులో ఉండే ధరలకు అమ్మితే, పేదలకు మేలు చేసినట్లు అవుతుందని మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుకురటయ్య అన్నారు. ఆదివారం పంగులూరులోని అపూర్వ మెడికల్‌ షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి మందులు అవసరం అవుతున్నాయని, ఆరోగ్యం ఖరీదు అయిపోయిన ఈ రోజుల్లో పేదలకు అందుబాటులో మందులు అమ్మాలని ఆయన సూచించారు. పంగులూరు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది పేదలే ఉంటారని, పేదలకు మేలు కలిగే విధంగా చూడాలన్నారు. యువకులైన రాజేష్‌, సురేష్‌ లు ఈ వ్యాపారంలో రాణించాలంటే ఓపిక, సహనం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాచిన చెంచు ప్రసాదు, పంగులూరు మండల అభివద్ధి కమిటీ అధ్యక్షులు రాయని వెంకట సుబ్బారావు, గ్రామ వైసిపి నాయకుడు గుడిపూడి రామారావు, పలువురు వైసిపి నాయకులు, పందిరి సుప్రీం, సురేషు, జాన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.