Aug 07,2022 22:22

ఫొటో : వైద్యం చేస్తున్న డాక్టర్‌ ఎమ్‌ వి రమణయ్య

ఫొటో : వైద్యం చేస్తున్న డాక్టర్‌ ఎమ్‌ వి రమణయ్య
పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎమ్‌.వి.రమణయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం వారి సౌజన్యంతో బిపి, షుగర్‌, పక్షవాతం వ్యాధులకు అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్‌ ఎంవి రమణయ్య, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ శ్రీనివాసులు, పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అతి తక్కువ ఖర్చుతో మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎం.వి. రమణయ్య మాట్లాడుతూ గతంలో ఆత్మకూరు, ఉదయగిరి, అనంతసాగరం, మర్రిపాడు, ఎఎస్‌పేట, మండలాల నుంచి నెల్లూరులో నిర్వహించే వైద్య శిబిరానికి వచ్చి వైద్యం పరీక్షలు నిర్వహించుకునే వారిని అక్కడికి రాకుండా ఆత్మకూరు నియోజకవర్గం ప్రజల కోసం ఆత్మకూరు పట్టణంలో అందరికీ అందుబాటులో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడా లేని విధంగా షుగర్‌ పరీక్ష రూ.25, ఇన్సులిన్‌ మందు రూ.80, రెండు నెలల సరిపోవు మందులు కేవలం రూ.200 తీసుకుంటామని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి మొదటి ఆదివారం క్యాంపు నిర్వహిస్తామని, ఈ క్యాంపును ఇక్కడ ప్రజలు ఈ తక్కువ ఖర్చుతో నిర్వహించే వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సీనియర్‌ నాయకులు ఎల్‌.కె.ప్రసాద్‌, షేక్‌ సందని, హరికృష్ణ, మల్లికార్జున, సాదిక్‌ హుస్సేన్‌, మురళీకృష్ణ, జీవి.శివప్రసాద్‌, డేవిడ్‌ రాజు, కెఎమ్‌ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్‌ చందన వారి సౌజన్యంతో ఉచితంగా వైద్యం అందజేశారు. పలువురికి దంత సమస్యలపై సలహాలు సూచనలు అందజేశారు.