
పశ్చిమ గోదావరి (ఏలూరు) : పేకాట శిబిరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తిరుమల ఎన్క్లేవ్ అపార్ట్మెంటులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు జరిపారు. 13 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.19 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు రూరల్ మాదేపల్లిలో పేకాట శిబిరంపై స్పెషల్ పార్టీ పోలీసుల దాడి చేశారు. రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని 34 మందిని అరెస్ట్ చేశారు.