Jul 29,2021 23:12

- సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్‌: పెంచిన ఇంటి పన్నులను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు, వార్డు కౌన్సిలర్‌లకు వాట్సాప్‌ ద్వారా వినతి పత్రం పంపినట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. గురువారం ఆవాజ్‌ జిల్లా కన్వీనర్‌ ఎస్‌.మస్తాన్‌ వలి, ఇన్షాఫ్‌ కమిటీ డివిజన్‌ నాయకులు ఎస్‌.షరీఫ్‌ బాషా, పిడిఎస్‌యు. జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎండి రఫీ మాట్లాడారు. నేడు 30వ తేదీ జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఇంటి, చెత్తపై వేసిన పన్నుల జీవోలను రద్దు చేయాలని తీర్మానం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను 196, 197, 198లను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.