Aug 07,2022 22:20

ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌టియు నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌టియు నాయకులు
పెండింగ్‌ బిల్లులు తక్షణమే చెల్లించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : పిఎఃఫ్‌, ఎ.పి.జి.ఎల్‌.ఐ, డి.ఎ. బకాయిలు, మెడికల్‌ రియంబర్స్‌మెంట్‌ తదితర ఆర్థిక పెండింగ్‌ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఎస్‌టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోను.రాజమనోహర్‌, అప్పన ఏడుకొండలు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎస్‌టియు జిల్లా కేంద్రంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ పిఆర్‌సి చర్చలలో భాగంగా పెండింగ్‌ ఆర్థిక బిల్లులను మార్చి 31 లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని అయితే బిల్లులు చెల్లించకపోగా మరలా జూన్‌ చివరి నాటికి చెల్లిస్తామని చెప్పారని వారు తెలియజేశారు.
కానీ జులై ముగిసినప్పటికీ పెండింగ్‌ బిల్లులు గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చెశారు. రిటైర్డ్‌ అయిన వాళ్లు, పెళ్లిళ్లు, గృహ అవసరాలకు లోన్ల కోసం దరఖాస్తు పెట్టుకొన్నవాళ్లు పడుతున్న ఇబ్బంది వర్ణణాతీతమని వారు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణం పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలకు కూడా వెనుకాడరని వారు తెలియజేశారు.