Jul 29,2021 22:17

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు


వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
పిఆర్‌సి అమలు చేయాలని
ప్రజాశక్తి-ఉదయగిరి:రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి సిపిఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ పీఆర్‌సి డిఏలను అమలు చేయాలని ఎపిటిఎఫ్‌ నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఏ.పి.టి.ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో వరికుంటపాడు, దుత్తలూరు,సీతారామపురం, ఉదయగిరి ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సి.పి.ఎస్‌ ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధించి పి.ఆర్‌.సి 2018 నుండి అమలు చేసి పెండింగ్లోని డి.ఎ బకాయలు ఆరు డి.ఏలను మంజూరు చేసి ప్రతి నెల ఒకటవ తేదీకి జీతాలు పెన్షన్‌ చెల్లింపు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సమస్యను పరిషరించాలన్నారు. 20 వేలు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి ప్రతి ప్రాథమిక పాఠాశాలకు పి.ఎన్‌. హెచ్‌.ఎం పోస్టు మంజూరు చేసి ఉపాధ్యాయులను నాడు నేడు వంటి బోధనేతర పనుల నుండి మినహాయించి గత వేసవిలో నాడు నెడు లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు సంపాధిత సెలవు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.
అనంతరం తహశీల్దార్‌ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మద్దతుగా ఎన్‌.జి.ఓ.సంఘం అధ్యక్షులు బొమ్మతట్టు శ్రీహరి, రైతు సంఘం నాయకులు కాకు.వెంకటయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు తిరపతిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌. ఎం.డి.ఖాజా,జిల్లా కార్యదర్శి వి.వెంకటేశ్వరరెడ్డి, ఎం.డి.ఖాదర్‌ బాషా,డి.బాలకష్ణ, ఎం.జిలాని, రమణారెడ్డి, బి.మాధవ రాజు, ఎస్‌.ఓబులేసు, ఏ.సుబ్బారెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, జిలాని, పి.మాల్యాద్రి పాల్గొన్నారు.