
మాట్లాడుతున్న జయరాం
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని ఆర్ల శివారు కొండలపై ఉన్న గిరిజన గ్రామం పిత్రిగెడ్డను సోమవారం నర్సీపట్నం ఆర్‌డిఒ హెచ్‌వి జయరాం సందర్శిం చారు. తమకు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పలు పత్రికల్లో వచ్చిన కథనాల నేపద్యంలో రోలుగుంట తహశీల్దార్ వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ రాజులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో గిరిజన కుటుంబాలతో మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.