Jul 29,2021 23:33

ప్రజాశక్తి-తెనాలి:మండలంలోని కొలకలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ పి.ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై డాక్టర్‌ సరళాదేవితో మాట్లా డారు. ఎంతమందికి వ్యాక్సిన్‌ చేయాల్సి ఉంది, ఎంతమందికి వ్యాక్సిన్‌ చేశారనే వివరాలను పరిశీలించారు. సచివాలయం-2ను సందర్శించి వాలంటీర్ల హాజరు, సచివాలయంలో రికార్డులు, సంక్షేమ పథకాలపై గోడ ప్రతులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎల్‌.విజయాలక్ష్మణ్‌, విఆర్వో రాంబాబు, సచివాలయ కార్యదర్శి తేజస్విని, వెల్ఫేర్‌ సెక్రటరీ త్రివేణి, వాలంటీర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పొన్నూరు : పట్టణంలోని 16, 17, 18, 19 వార్డు సచివాలయాలను జెసి దినేష్‌కుమార్‌ గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పెన్సిల్‌తో రాయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా, తహశీల్దార్‌ డి.పద్మనాభుడు, కమిషనర్‌ పి.వెంకటేశ్వరరావు, నోడల్‌ ఆఫీసర్‌ నాగవేణి ఉన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ : ఉద్యోగులు రెండుసార్లు బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ఎంపిడిఒ డి.అనురాధ చెప్పారు. తాడికొండ 1, 2 సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. ఆమెవెంట సర్పంచ్‌ టి.సరోజిని, ఉప సర్పంచ్‌ వెంకటరెడ్డి, కార్యదర్శి పి.శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.