Sep 15,2021 21:54

పిఇఎస్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ చెన్నబసవ పాటిల్‌
ప్రజాశక్తి- గుడిపల్లి:
మండలంలోని పిఇఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ చిన్నబసవ పాటిల్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం ఆసుపత్రికి అందుబాటులో ఉంటూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వైద్యకళాశాల డీన్‌ హెచ్‌ఆర్‌ కృష్ణారావు, వైస్‌ ప్రిన్సిఫాల్‌ సుబ్బారావు, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.