Mar 01,2021 15:31

ఇంట్లో ఎలుకల బెడద లేకుండా ఉండడానికి పిల్లుల్ని పెంచుతారు. ఆ పెంచే క్రమంలో వాటితో అనుబంధం కూడా పెరుగుతంది. ఇక చిన్న పిల్లలైతే.. వాటితో ఎంచక్కా ఆడుకుంటారు కూడా..! అయితే ప్రత్యేకించి పిల్లుల గురించే ఎందుకు చెప్పుకోవాలి అనుకుంటున్నారా..? అసలు విషయానికొస్తే.. ఓ పిల్లి తన ప్రత్యేకతను చాటుకుంది. అదేంటంటే.. ఎంచకా మ్యూజిక్‌కి తగ్గట్టుగా సంగీతం ప్లే చేస్తుంది. కీబోర్డులోని కొన్ని కీస్‌ను వాయిస్తోంది. అలాగే ఇతర సాధనాలతో సంగీతాన్ని సృష్టిస్తోంది. కంప్యూటర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. 'మియావ్‌ శాంపిల్స్‌'అని సెర్చ్‌ కూడా చేస్తుంది. ఇంకో విషయమండోరు... ప్రత్యేకించి ఈ పిల్లికి పేరు కూడా ఉంది. దాని పేరు పాటర్సన్‌. ఓ పిల్లి ఇంత చేస్తుందా అని నోరెళ్లబెట్టకండి.. నిజమే.. ఈ వీడియోను చూస్తే ఎవరైనాసరే పాటర్సన్‌ను మెచ్చుకోవాల్సిందే. క్యాట్‌ మ్యూజిక్‌ ప్లే చేస్తున్న వీడియోను సూపర్‌ మాసివ్‌ అనే బ్యాండ్‌ పేరుతో ఫిబ్రవరి 19న షేర్‌ చేయడం జరిగింది. ఈ వీడియోను ఇప్పటివరకు 28 లక్షల మంది దాకా వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్‌ మ్యూజిక్‌ ప్లే చేస్తున్నప్పుడు పాటర్సన్‌ను ఎవ్వరూ డిస్ట్రబ్‌ చేయకూడదు అని కామెంట్‌ చేశారు. మరొకరేమో.. మియావ్‌ శాంపిల్స్‌ కాకుండా.. ఆ బ్యాండ్‌ పేరు సూపర్‌మెవ్‌సివ్‌ మ్యూజిక్‌గా మార్చుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.

supermassivemusic Verified