May 13,2022 18:56

పిల్లలం పిల్లలం
మేం లేలేత మల్లెలం

సుకుమార కుసుమాలం
సువాసన వెదజల్లే పుష్పాలం

అందమైన పూల మొక్కలం
కల్మషం లేని పసి మొగ్గలం

ఆడి పాడే చిన్నారులం
అనుక్షణం ఆనందంగా ఉంటాం

స్నేహితులతో సరదాగా ఆడుకుంటాం
రోజంతా హాయిగా గడుపుతాం

వేకువ ఝామున నిద్ర లేస్తాం
వడివడిగా రెడీ అవుతాం
ముద్దుగా ముస్తాబవుతాం

బుడి బుడి నడకతో బడికెళతాం
పాఠాలెన్నో నేర్చుకుంటాం
బుద్ధిగా చదువుకుంటాం

గురువుల మాటలు గుండెల్లో పెట్టుకుని ఆచరిస్తాం
అమ్మానాన్నకు ఆలంబనగా ఉంటాం
నానమ్మ తాతయ్య చెప్పే కథలు వింటూ బజ్జుకుంటాం