Nov 26,2021 08:31

సుండుపల్లి (కడప) : సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టు పై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్‌ నిపుణుల బృందం అధికారులకు సూచించింది. ఇటీవల వరదలకు తెగిన ప్రాజెక్టును నిపుణుల బృందం సభ్యులు నీటిపారుదలశాఖ డిజైన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులు సత్యనారాయణ, గిరిధర్‌ రెడ్డి లు శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు లోపల నిర్మించి తెగిపోయిన బండ ప్రాంతాన్ని, గేట్లను ప్రాజెక్టు, అలుగు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినట్లయితే మునక ప్రాంతం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీప్రాంతంలో సర్వే చేయాలని నిపుణుల బృందం తెలిపింది. వరద ఉధృతి అధికం కావడం వల్లనే రింగ్‌ బండ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈసి శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి ,మధుసూదన్‌ రావు, ఎంపిడిఒ రామచంద్రారెడ్డి, వైసిపి నాయకులు శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.