Oct 14,2021 20:24

శ్రీరామ్మూర్తికి పురస్కారం అందజేస్తున్న అతిథులు

ప్రజాశక్తి -కంటోన్మెంట్‌ : సమాజాన్ని తమ రచనలతో ప్రభావితం చేసే రచయితలలో డాక్టర్‌ వేదగిరి రాంబాబు ఒకరని ప్రేమసమాజం అధ్యక్షుడు డాక్టర్‌ బిఎస్‌ఆర్‌ మూర్తి అన్నారు. అభినందన సేవా సంస్థ గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో బిఎస్‌ఆర్‌ మూర్తి మాట్లాడారు. వేదగిరి రాంబాబు గొప్ప రచయిత, సాహితీ సేవకుడని, ఆయనపేరిట పురస్కారం మరోప్రముఖ రచయిత పివిబి శ్రీరామూర్తికి ఇవ్వడం ఎంతో సముచితమని అన్నారు. సభలో కౌముది పరిషత్‌ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు, వేలమూరి నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం రచయిత శ్రీరామ్మూర్తికి శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రంతో పాటు రూ రూ.5116 బహూకరించారు. కార్యక్రమంలో దేవరాజు గోపాలకష్ణ, నేరేళ్ల వెంకట్రావు, డివిఎస్‌.సుబ్రహ్మణ్యం, మానాప్రగడ సాహితీ తదితరులు పాల్గొన్నారు.