Aug 18,2022 20:56

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కార్పొరేషన్‌ అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పరిధిలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో చేపడుతున్న సర్వేను పకడ్బందీ ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రవీణ్‌ కుమార్‌.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన విధివిధానాల గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు. కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు మధుసూదన్‌రావు, అమ్మాజీ రావు, ఇఇ కె.శ్రీనివాసరావు, సర్వేయర్‌ సింహాచలం, అడ్మిన్‌, ప్లానింగ్‌, ఎమినిటిస్‌ కార్యదర్శులు, విఆర్‌ఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎంఎ మాట్లా డారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూమికి నిర్దిష్టమైన మార్కింగ్‌ చేయడంతోపాటు భూ హక్కుదారులకు గుర్తింపు నంబర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా భూమికి హద్దులు, శాశ్వత హక్కులు ఇచ్చేందుకు ప్రతిపాదించిందన్నారు. దీనివల్ల భూముల లావాదేవీల సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.