Jul 28,2021 23:42

కొల్లూరులో ఎరువుల నిల్వలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

ప్రజాశక్తి - కొల్లూరు : మండల కేంద్రమైన కొల్లూరులోని సచివలయాలు, రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు అంశాలపై సిబ్బంది పొంతనలేని సమాధానాలపై మండిపడ్డారు. పనులు సరిగా చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తీరు మార్చుకోవాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రం-3లో ఎరువుల నిల్వలపై సిబ్బంది సరిగా లెక్క చెప్పకపోవడంతో గోదాములను పరిశీలించి సిబ్బంది చెప్పినదానికంటే ఎక్కువగా నిల్వ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి-తెనాలి : ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు సబ్‌కలెక్టర్‌ నిధి మీనా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక నందులపేటలోని 10వ నంబర్‌ షాపును పరిశీలించారు. స్టాకు రిజిస్టర్‌ను, షాపులో నిల్వ ఉన్న సరకును దగ్గరుండి లెక్కింపజేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట సీఎస్‌డీటీ లక్ష్మణరావు, ఏఎస్‌ఓ బాషా, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనంతరం 7వ వార్డు సచివాలయాన్ని సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. సమస్యల పరిష్కారంలో సిబ్బంది సేవలపై ఆరా తీశారు. ఆమె వెంట వీఆర్వో శ్రావణ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఏర్పడిన సచివాలయ వ్యవస్థలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని కమిషనర్‌ ఎం.జస్వంతరావు హెచ్చిరించారు. పట్టణంలోని 1, 2, 44, 45, 46 సచివాలయాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన, హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని చెప్పారు. ఆయనవెంట మున్సిపల్‌ మేనేజర్‌ ఐ.శ్రీనివాలు ఉన్నారు.
8వ శానిటరీ డివిజన్‌లో ఉదయం కమిషనర్‌ పర్యటించి సిబ్బంది హాజరు, పనులను పరిశీలించారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎ.రామచంద్రరావు, రామారావు, సూర్యవర్ధనరావు, షేక్‌ బాజిహుస్సేన్‌ ఉన్నారు.
వార్డుల్లో చైర్‌పర్సన్‌ పర్యటన
పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖలేదా నశీం చెప్పారు. పట్టణంలోని 5, 6, 16,27, 29 వార్డుల్లో బుధవారం ఆమె పర్యటించారు. సైడ్‌ డ్రెయిన్స్‌ పనిచేస్తున్న తీరు, పారిశుధ్యం నిర్వహణను పరిశీలించారు. 15వ ఆర్ధిక సంఘ నిధులతో అవసరమైన కల్వర్టులు, డ్రెయిన్‌లు, రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.