May 05,2021 00:41

విశాఖ స్టేషన్‌లో నిలిచిన రైలు

ఎంవిపి.కాలనీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తూ, సర్వీసులను కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైలు నెంబర్‌ 08417/08418 పూరి-గుణపూర్‌-పూరి ప్రత్యేక రైళ్లురద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లలో కొద్దికాలంగా ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రత, ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలోని సంబల్పూర్‌ డివిజన్‌లో వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా రైలు నెంబర్‌ 08528 విశాఖపట్నం - రారుపూర్‌ ప్రత్యేక రైలును ఈ నెల 5న రద్దు చేశారు. అదే విధంగా రైలు నెంబర్‌ 08527 రారుపూర్‌ - విశాఖపట్నం ప్రత్యేక రైలును కూడా నిలిపివేశారు. రైలు నెంబర్‌ 06216 మైసూరు - దానపూర్‌ వన్‌ వే సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో మార్పులు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6న గురువారం రాత్రి 11.00 గంటలకు మైసూరు నుంచి బయలుదేరి 8న శనివారం 20:45 గంటలకు దనాపూర్‌ చేరుకుంటుంది. ఇది ఒక ట్రిప్‌ మాత్రమే నడుస్తుంది. వన్‌ వే ప్రత్యేక రైలు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో విశాఖపట్నం, ఖుర్దా రోడ్‌, భద్రక్‌ మీదుగా ప్రయాణిస్తుంది.
సర్వీసుల కుదింపు ఇలా..
రైలు నెంబర్‌ 06597/06598 యశ్వంత్‌పూర్‌ - హౌరా -యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైళ్ల సేవలను మూడు ట్రిప్పులకు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇంతకుముందు ఈ రైళ్లును ఏప్రిల్‌ 22 నుంచి జూన్‌ 29 వరకూ నడుపుతున్నట్లు ప్రకటించారు. కోవిడ్‌ పరిస్థితుల రీత్యా ఇప్పుడు కేవలం మూడు ట్రిప్పులే నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రైలు నెంబర్‌ 06597 యశ్వంత్‌పూర్‌ - హౌరా ప్రత్యేక రైలు మే 6న గురువారం నడుస్తుంది. రైలు నెంబర్‌ 06598 హౌరా -యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైలు 11న ప్రయాణంలో ఉంటుంది. మార్పులను గమనించాలని రైల్వే సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ త్రిపాఠి ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.