Apr 09,2021 00:03

రోగులకు పండ్లు, రొట్టె అందజేస్తున్న అభిమాని

భీమునిపట్నం : సినీ హీరో అల్లు అర్జున్‌ అభిమానులు గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మొక్కలు అందజేశారు. వైసిపి యువజన విభాగం పట్టణ అధ్యక్షులు బి.హరికిరణ్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో అభిమాన సంఘం సభ్యులు డి.శ్రీను, జి.వెంకటరావు, సిహెచ్‌.అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.