
ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని వావిలపాడు సచివాలయంలో సోమవారం వావిలపాడు, వీలుపర్తి, నల్లమిల్లి సచివాలయాలకు చెందిన వాలంటీర్ల సేవలకు గ్రామస్తులు పురస్కారాలు అందించారు. సర్పంచ్ బీల రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి దొగ్గ సత్యవంతుడు పాల్గొని మాట్లాడారు. వాలంటీర్లు మరిన్ని సేవలు అందించి ప్రజాధరణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు ముమ్ములూరి జగన్నాథం, ఎంపిడిఒ పట్నాయక్, ఇఒపిఆర్‌డి సూర్యనారాయణ, నాయకులు బీల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: మండలంలోని సీతారామునిపేట సచివాయం పరిధిలోని గొర్లిపేట, కొత్తపేట గ్రామ వాలంటీర్లకు సోమవారం సత్కారం చేశారు. ఎపి టూరిజం డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం వాలంటీర్లకు సన్మానం చేశారు.
డెంకాడ: వాలంటీర్లు గ్రామాల్లో చేస్తున్న సేవలు మరువలేనివని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు తెలిపారు. మండలంలోని చొల్లంగిపేటలో గుణుపూరపేట, ఢ కొల్లం, చెల్లంపేట, గునుపూర్ వాలంటీర్లకు సోమవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిపి మాట్లాడుతూ వాలంటీర్లు బాధ్యతతో పనిచేసి గ్రామానికే కాకుండా మండలానికి జిల్లాకి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం వాలంటీర్లను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తమ్మినాయుడు, జెడ్‌పిటిసి బడ్డుకొండ లక్ష్మి, ఎంపిడిఒ డిడి స్వరూపారాణి, సర్పంచులు కోరాడ కనకరాజు, పైలు ముత్యాలరావు, అట్టాడ కృష్ణ, ఎంపిటిసి కిరణ్ కుమార్, నాయకులు కొత్తడి శ్రీనివాసరావు, డీలర్ రాజు, మహంతి నరసింగరావు, సురేష్, అప్పారావు, కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
బొబ్బిలి: పట్టణంలోని 13,14,15 వార్డులలో పని చేస్తున్న వాలంటీర్లను వార్డు సచివలయాల్లో సోమవారం మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ సత్కరించారు. వాలంటీర్ల సేవలను కొనియాడారు. అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఎస్.శ్రీలక్ష్మి, మున్సిపల్ ఆర్‌ఒ ప్రసాద్,పాల్గొన్నారు.
బొండపల్లి: గ్రామాలలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రజల మన్ననను పొందాలని ఎంపిపి చల్ల చలం నాయుడు కోరారు. సోమవారం మండలంలో ముద్దూరు, బొండపల్లి పంచాయతిలలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు మునకాల పైడిపునాయుడు, బొండపల్లి ఈశ్వరరావు అధ్యక్షతన వాలంటీర్లకు వందనంలో భాగంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పధకాలు అందించడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వేధావతి, హౌసింగ్ ఎఇ రామరాజు, ఎంపిటిసి బండారు శ్రీనువాస రావు, ఉప సర్పంచ్ కోల వెంకటరమణ, గ్రామ కార్యదర్శి జి.శ్రీనువాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: రాష్ట్రంలో లంచగొండి వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. మండలంలోని నిమ్మలపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం నిమ్మలపాలెం, అప్పన్నపాలెం, ఉత్తరాపల్లి, చిన్నిపాలెం గ్రామ పంచాయితీలకు చెందిన వాలంటీర్లను సత్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థ వైపు ఇప్పుడు దేశం మొత్తం చూడడం మన రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, నిమ్మలపాలెం, అప్పన్నపాలెం, ఉత్తరాపల్లి, చిన్నిపాలెం సర్పంచులు కొట్యాడ శ్రీనివాసరావు, కోన దేముడు, ఎస్.గణేష్, ఆర్.పవన్ కుమార్, ఎంపిటిసి శివప్రసాద్, వార్డు మెంబర్లు, పంచాయితీ విస్తరణాధికారి ధర్మారావు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: వాలంటరీల ద్వారా రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థ రూపొందిందని స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. సోమవారం మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో భర్తాపురం, పెద్దకండేపల్లి సచివాలయ పరిధిలో పెద్దకండేపల్లి, సంత గౌరమ్మపేట సచివాలయం పరిధిలో సంత గౌరమ్మపేట, వినాయక పల్లి, వీరనారాయణం సచివాలయం పరిధిలో వీరనారాయణం, వెంకటరమణ పేట, తిమిడి, కొత్తూరు తదితర సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవ పురస్కారావు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, జెడ్‌పిటిసి ఎమ్.వెంకటలక్ష్మి, వైస్ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, స్థానిక సర్పంచ్ ఎమ్.సరోజిని, ఎంపిటిసి బోజంకి వెంకటలక్ష్మి, మాజీ ఎంపిటిసిలు బోజంకి గోవింద్ ఎమ్.సత్యనారాయణ, వేపాడ మండలం రామస్వామిపేట సర్పంచ్ శర్మ, స్థానిక మాజీ సర్పంచ్ సోంబాబు, నాయకులు రామునాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.