Oct 03,2022 00:23

జగన్‌ మనసు మార్చాలని గాంధీజీకి వినతి పత్రం అందజేస్తున్న పంచాయతీ కార్మికులు


జగన్‌ మనసు మార్చాలని గాంధీజీకి వినతి పత్రాలు
ప్రజాశక్తి ఏలేశ్వరం
గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దే పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా జగన్మోహన్‌ రెడ్డి మనసు మార్చాలని ప్రతిపాడులో గాంధీజీ విగ్రహానికి కార్మికులు సమర్పించారు. సిఐటియు నాయకుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 20,000 ఇచ్చేలా, పంచాయతీ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించేలా జగన్మోహన్‌ రెడ్డి మనసు మార్చాలని గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా వినతి పత్రాలు సమర్పించామన్నారు. జిల్లా కమిటీ నిర్ణయం మేరకు అక్టోబర్‌2 నుండి జరగ వలసిన నిరవధిక సమ్మె వాయిదా వేయడం జరిగింన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు బి నాగరాజు ఎం.నాగరాజు చిన్నారావు దాసు కొండబాబు దుర్గా లక్ష్మి ఉన్నారు.