Aug 18,2022 23:19

తనిఖీలు చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి శిరీషరాణి

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట : మండలంలోని దిబ్బిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో పలు లోపాలను గుర్తించారు. గ్రామసభ, పాలకవర్గ సమావేశాల్లో గ్రామ అవసరాలకు తీసుకున్న తీర్మానాలలో మినిట్స్‌ పుస్తకంలో ఖాళీలను గుర్తించి పంచాయతీ కార్యదర్శి రాధారాణిపై డిపిఓ శిరీష రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ చేయకుండా ఖాళీలను ఏ విధంగా ఉంచారని ప్రశ్నించారు. రికార్డ్‌ సక్రమంగా నిర్వహించకపోతే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. రైతు భరోసా కేంద్రం పునాదుల వరకే నిర్మించి ఉండడాన్ని గుర్తించి తక్షణమే భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సర్పంచ్‌కు సూచించారు.