Jul 29,2021 22:23

పార్వతిని సన్మానిస్తున్న ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది

       గుడిబండ : మండల పరిధిలోని కొంకలు పంచాయతీ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై విజయవాడ సచివాలయానికి బదిలీపై వెళ్తున్న పార్వతిని గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంపిడిఒ నరేంద్ర కుమార్‌, ఈవోఆర్డీ నాగరాజు నాయక్‌ సమక్షంలో వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. పార్వతి గ్రూప్‌-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విజయవాడ సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. పంచాయతీ కార్యదర్శిగా ఆమె చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు, సింగిలివిండో అధ్యక్షుడు చంద్రప్ప, సర్పంచి లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు గోవిందప్ప, పంచాయతీ కార్యదర్శులు సురేష్‌ బాబు, అజరు, హరి, శ్రీరంగమ్మ, ధనలక్ష్మి, అరుణ, దాదా ఖలెందర్‌, యు.అరుణ. వెన్నెల కేధార్‌నాథ్‌, పాల్గొన్నారు.