Oct 13,2021 18:25

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్‌ స్వాతి, శివాత్మిక రాజశేఖర్‌, సముద్రఖని, రాహుల్‌ విజరు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'పంచతంత్రం'. పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌తో పంచతంత్ర కథలను చెబుతూ విడుదలైన ఈ టీజర్‌ ఆసక్తిగా సాగింది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ మూవీగా 'పంచతంత్రం' చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'పంచతంత్రం' టీజర్‌ విడుదల

https://youtu.be/TumrPU5G4TQ