Oct 18,2020 21:28

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓమర్లకు 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చివరలో చెలరేగి ఆడటంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని విధించింది. క్వింటన్‌ డికాక్‌ (53 : 43 బంతుల్లో : 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు తోడు కృనాల్‌ పాండ్య (34 : 30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) ఫరవాలేదనిపించినా.. చివరలో కీరన్‌ పోలార్డ్‌ (34 నాటౌట్‌ : 12 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లు), నాతన్‌ కౌల్టర్‌ నిల్‌ (24 నాటౌట్‌ : 12 బంతుల్లో 4 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో చివరి మూడు ఓవర్లలో భారీ పరుగులు వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ జోర్డాన్‌, రవి బిష్ణోయి చెరో వికెట్‌ తీశారు.
అర్షదీప్‌ సింగ్‌ మూడో ఓవర్‌లో రోహిత్‌ (9)ను బౌల్డ్‌ చేయగా.. షమీ నాలుగో ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. మురగన్‌ అశ్విన్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు తీశారు. అర్షదీప్‌ సింగ్‌ ఆరో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ (7)ను వికెట్‌ తీసి ముంబై వెన్ను విరిచాడు. మురగన్‌ అశ్విన్‌ చేతికి చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 43 పరుగులకే ముంబై మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ముంబై ఇండియన్స్‌అయినప్పటికీ పరుగులను కట్టడి చేయడంతో పంజాబ్‌ బౌలర్లు విఫలమయ్యారు. వికెట్లు పడుతున్నప్పటికీ స్కోర్‌ బోర్డు వేగంగా కదులుతూనే వచ్చింది. మాక్స్‌వెల్‌ ఏడో ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి స్కోర్‌ను కట్టడి చేశాడు. ఎనిమిదో ఓవర్‌లో సిక్స్‌, తొమ్మిదో ఓవర్‌లో ఫోర్‌ బాదిన కృనాల్‌ పాండ్య పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. 11వ ఓవర్‌లో డికాక్‌ సిక్స్‌ బాదగా.. 12వ ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 13వ ఓవర్‌లో కృనాల్‌ పాండ్య ఫోర్‌ బాదడంతో డికాక్‌, పాండ్య జోడి కలిసి 50 పరుగులు చేశారు. అదే ఓవర్‌లో డికాక్‌ మరో ఫోర్‌ బాదాడు. ఆ తరువాతి ఓవర్‌లో రవి బిష్ణోయి కృనాల్‌ పాండ్య 34 (30) పెవిలియన్‌ చేర్చాడు. దీపక్‌ హుడా చేతికి చిక్కి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చీ రాగానే హార్దిక్‌ పాండ్య సిక్స్‌ బాదాడు. 15వ ఓవర్‌లో ఫోర్‌, సిక్స్‌తో డికాక్‌ చెలరేగిపోయి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ 16వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్య (8)ని ఔట్‌ చేయగా.. 17వ ఓవర్‌లో జోర్డాన్‌ దూకుడుగా ఆడుతున్న డికాక్‌ 53 (43)కు కళ్లెం వేశాడు. అగర్వాల్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు.
18 బంతుల్లో 54 పరుగులు.. పోలార్డ్‌, కౌల్టర్‌ నిల్‌ మెరుపు బ్యాటింగ్‌!
చివరలో కీరన్‌ పోలార్డ్‌, కౌల్టర్‌ నిల్‌ మెరుపు ఇన్నింగ్‌ ఆడి కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు రాబట్టారు. 18వ ఓవర్‌లో కీరన్‌ పోలార్డ్‌ రెండు సిక్స్‌లు, కౌల్టర్‌ నిల్‌ రెండు ఫోర్లతో చెలరేగిపోయి ఆ ఓవర్‌లో 22 పరుగులు రాబట్టారు. 19వ ఓవర్‌లో కౌల్టర్‌ నిల్‌ రెండు ఫోర్లు బాదాడు. చివరి ఓవర్‌లో పోలార్డ్‌ 6, 2, 6, 4తో చెలరేగడంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి ముంబై 176 పరుగులు చేసింది.