
సిడ్నీ : ఆస్ట్రేలియా - భారత్ జరుగుతున్న మూడవ టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ...వివాదాలు కూడా అంతే చుట్టుముట్టాయి. సిరాజ్‌పై గ్యాలరీలో కొంత మంది ఆస్ట్రేలియన్లు జాత్యంహకారపు దూషణలు చేయగా..ఇటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ క్రికెట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ కూడా క్రికెట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. చివరి టెస్టుల్లో భాగంగా ఆట ముగిసే రోజు తొలి సెషన్లో కెప్టెన్ అజింక్య రహనె, రిషబ్ పంత్ బరిలోకి దిగారు. రహనె నాలుగు పరుగుల వద్ద ఔటు కాగా...రిషబ్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎంతకూ రిషబ్‌ను కట్టడి చేయలేకపోతున్నామని ఉడుక్కున స్మీత్.. డ్రింక్ విరామ సమయంలో రిషబ్ బ్యాంటింగ్ కోసం పెట్టుకున్న గార్డ్ గుర్తులను స్మిత్ బూట్లతో చెరిపేసారు. స్టంప్ దగ్గర అమర్చిన కెమెరాలలో ఈ విషయం బట్టబయలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో..భారత్ క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ స్పందిస్తున్నారు. రిషబ్‌ను అవుట్ చేసేందుకు స్మిత్ కుట్ర చేశాడంటూ ఆరోపిస్తున్నారు. కాగా, రిషబ్ పంత్ 97 పరుగులు తీసి ఔటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన అశ్విన్, పూజారాలు క్రీజులో నిలిచి..ఆటను డ్రాగా ముగించారు.
మీరు వీడియోను చూసేయండి మరీ https://youtu.be/Wza3n8s6ijM