
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ఇప్పటికే జగన్ ప్రభుత్వం శాసనసభ, న్యాయ వ్యవస్థలను నాశనం చేసిందని ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థను కూడా నాశనం చేసిందని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శనివారం ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ... శుక్రవారం భీమవరంలో జరిగిన డిఆర్సి మీటింగ్కు కనీసం తనను పిలవలేదని చెప్పారు. అన్ని వ్యవస్థలను జగన్ తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని విమర్శించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల నుంచి జీతాలు ఇస్తే వారికి అభ్యంతరం ఉండదని ఎద్దేవా చేశారు. పన్నులు తాము చెల్లిస్తే .. పనులు వైసిపి నేతలకు చేస్తారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీస్ లపై జాతీయ జెండాను ఎగురవేసే అజెండా మాత్రం వైసిపి దా అని మరోసారి ప్రశ్నించారు.