Nov 29,2021 23:26

ప్రజాశక్తి-చీమకుర్తి: అన్ని పంచాయతీలలో వంద శాతం పన్నులు వసూలయ్యేలా చర్యలు తీసు కోవాలని జిల్లా పంచాయతీ అధికారి జివి. నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ఆర్‌ఎల్‌ పంచాయతీ పరిధిలోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. సిటిజన్‌ ఆవుట్‌ రీచ్‌ సర్వేని ఫీల్డు లెవల్‌లో గ్రామంలో తిరిగి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంపూర్ణ భూహక్కు పథకంలో భాగంగా ఓటిఎస్‌ చెల్లింపు ద్వారా లబ్ధిదారులకు అందే ఫలాల గురించి సిబ్బందికి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపిఒ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓటిఎస్‌ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో సైడు కాల్వలు, పూడికలు ఎప్పటికప్పుడు తీయించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీధి దీపాల పనితీరు గమనించి, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రవికుమార్‌, విస్తరణాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.