Jul 29,2021 20:38

సమావేశంలో మాట్లాడుతున్న డిసిసిబి చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు

కొత్తవలస : మహిళా సాధికారిత లో భాగంగా పొదుపు సంఘాల బలోపేతానికి తమ బ్యాంకు కషి చేస్తుందని డి.సి.సి.బి.ఛైర్మన్‌ నెక్కల నాయుడు బాబు తెలిపారు. కొత్తవలసలో డిసిసిబి సిఇఒ కె.జనార్దనరావు అధ్యక్షతన ఎస్‌హెచ్‌సి గ్రూపు సభ్యులు, రైతులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 356 ఎస్‌హెచ్‌సి గ్రూపుల్లో 4వేల మంది సభ్యుల కు తక్కువ వడ్డీతో రూ.15 కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.450 కోట్లు రుణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.200 కోట్లు రుణాలు ఇచ్చామని, మరో రూ.150 కోట్లు రుణాలు అంది స్తామని తెలిపారు. కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్‌ ద్వారా 172 యూనిట్లకు ఫైనాన్స్‌ అందిస్తా మని తెలిపారు. జిల్లాలో 8 ప్రాంతాల్లో హెచ్‌పిసిఎల్‌ పెట్రోల్‌ బంకులు సొసైటీ ద్వారా నడపనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా సొసైటీ ద్వారా మూడు పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల పిల్లలకు 10 లక్షల వరకు సహకార విద్యా రుణాలు అందిస్తామని, కోవిడ్‌ నేపద్యంలో ఎస్‌.హెచ్‌.సి.గ్రూపులో ప్రతీ సభ్యురాలకు రూ. 10 వేలు రుణ వసతి అందిస్తామని, సహకార సంఘ ఉద్యోగులకు లక్ష రూపా యల వ్యక్తిగత రుణాలు అందిస్తా మని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ సిహెచ్‌ వెంకట రమణ, ఎం. సత్యనారాయణ, డిజిఎం ఉమా మహేశ్వరరావు, ఎజిఎం బి.లక్ష్మణరావు, ఎఫ్‌ఎల్‌సి ప్రభాకర రావు, ఐ.కె.పి.ఏరియా కో''ఆర్డినేటర్‌ జయశ్రీ, కొత్తవలస బ్రాంచ్‌ మేనేజర్‌ జి.బి.ఆర్‌.కిరణ్‌ పాల్గొన్నారు.