
ప్రజాశక్తి - చెరుకుపల్లి (అమర్తలూరు)
మండలంలోని వరి పొలాలపై అక్కడక్కడ ఆకు ముడత పురుగు ఆశించిందని, రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఎఒ ఉయ్యూరు లోకేశ్వరి సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని వరి పొలాలు ఆమె మంగళవారం పరిశీలించారు. ఆకు ముడత పురుగు నివారణకు క్లోరి ఫైరిపాస్ 250 ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారి చేయాలని లేదా ఇస్పేట్ 320 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా నత్రజనితో పాటు, ఎకరాకు 25కేజీల పొటాష్ పిచికారి చేయాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు పంట నమోదు, ఈ కేవైసీ చేయించాలని కోరారు.