Feb 02,2023 02:25
పొలం బడి నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వేటపాలెం: రైతు భరోసా కేంద్రం పరిధిలోని అక్కాయపాలెం గ్రామంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పొలంబడి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ఐ కాశీవిశ్వనాథం మాట్లాడు తూ రైతులకు సాగు ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడి పెంచుకునే దిశగా సూచనలు సలహాలు ఇచ్చారు. ఏ పురుగులకు ఏ మందు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే రైతులకు పంట సాగులో సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, ఏఇఓ గోపికృష్ణ, పంచాయతీ సెక్రెటరీ పూర్ణకుమారి, స్వాతి, రామారావు, శివనాగ బాబు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.