Mar 28,2023 00:47
అనారోగ్యంతో మరణించిన ఏఎస్‌ఐ సతీమణి కె లక్ష్మికి అడిషనల్‌ కార్పస్‌ ఫండ్‌ చెక్కును అందజేసిన బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబరు 25న అనారోగ్యంతో మరణించిన ఏఎస్‌ఐ కె బ్రహ్మయ్యకు సంబంధించిన రూ.1 లక్ష అడిషనల్‌ కార్పస్‌ ఫండ్‌ చెక్కును ఆయన సతీమణి లక్ష్మికి సోమవారం బాపట్ల జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందజేశారు. జిల్లా ఎస్పీ మరణించిన బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖలో అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. అటువంటి వారి కుటుంబాలకు పోలీస్‌ శాఖ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి అందవలసిన ఇతర అన్ని బెనిఫిట్లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ బి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కె రాధిక, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.