
పోలీస్‌స్టేషన్‌కు చేరిన ప్రశ్నాపత్రాలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు చేరాయని ఎంఇఒ షేక్ మస్తాన్‌వలీ పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్ జరిగిన ప్రశ్న పత్రాలను పరిశీలించి ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ నుంచి ఉదయగిరి పోలీస్ స్టేషన్‌కు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు వచ్చాయని ఎగ్జామ్‌నేషన్ చీఫ్‌లు, డిపార్ట్మెంట్ సిబ్బంది సహకారంతో పరీక్ష పత్రాలను భద్రపరిచినట్లు ఎంఇఒ తెలిపారు. ఏప్రిల్ 3 నుండి 15వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మండల పరిధిలో ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ స్కూల్, గండిపాలెంలోని జిల్లా పరిషత్, ఎపి రెసిడెన్షియల్ స్కూల్లలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయగిరి మండలం నుండి 474 మంది వరికుంటపాడు మండలం నుండి రెండు స్కూలు 50 మంది విద్యార్థులు మొత్తం 524 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.