Jun 23,2021 16:05

దేవీపట్నం (తూర్పు గోదావరి) : పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద వరద ప్రవాహం గత రెండు రోజులుగా పెరిగింది. ఈ నేపథ్యంలో వెనుక భాగంలోని పోచమ్మ గండి పూడిపల్లి దేవీపట్నం నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. గోదావరి ప్రవాహం పెరగడంతో దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దండంగి, చిన్న రమణయ్యపేట గ్రామాల మధ్య వాగుపై వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి ప్రజలు ఇంజన్‌ పడవపై రాకపోకలు సాగిస్తున్నారు. దండంగి, గుబ్బల పాలెం, తోయ్యేరు, ఏ వీరవరం పరిసర ప్రాంతాల్లో సాగు భూములు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. అదేవిధంగా వీరవరం, తోయ్యేరు మధ్య ఆర్‌అండ్‌బి రహదారి ముంపునకు గురైంది. ఏ వీరవరం వద్ద కడమ్మ వాగుకు వరద నీరు పోటెత్తింది. దాంతో తోయ్యేరు ఆర్‌ఆర్‌బి చట్టాలపై నాలుగు అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. దాంతో ముంపు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది.