Nov 24,2021 22:09

బౌఫౌంటైన్‌: దక్షిణాఫ్రికాాఏతో జరుగుతున్న నాలుగురోజుల అనధికారి తొలి టెస్ట్‌లో ఇండియాాఏ జట్టు పోరాడుతోంది. దక్షిణాఫ్రికాాఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 509 పరుగుల భారీస్కోర్‌ అనంతరం డిక్లేర్డ్‌ చేయగా.. రెండో రోజు ఆట నిలిచే సమయానికి ఇండియాాఏ వికెట్‌ నష్టానికి 125 పరుగులు చేసింది. పృథ్వీ షా(48) తృటిలో అర్ధసెంచరీని మిస్‌ చేసుకోగా.. కెప్టెన్‌ ప్రియాంక్‌ పంచల్‌(45) అభిమన్యు ఈశ్వరన్‌(27) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్‌ మలాన్‌(163), జోర్జీ(117) శతకాలకు తోడు స్మిత్‌(52), క్వెషిలే(72), జార్జ్‌ లిండే(51) అర్ధసెంచరీలతో రాణించారు. నవ్‌దీప్‌ సైనీ, ఆర్జాన్‌కు రెండేసి, ఉమ్రన్‌ మాలిక్‌, రాహుల్‌ చాహర్‌కు తలా ఒక వికెట్‌ లభించాయి. దక్షిణాఫ్రికా కంటే ఇండియాాఏ జట్టు 384 పరుగులు వెనుకబడి ఉంది.