Oct 03,2022 00:31

స‌త్తెన‌ప‌ల్లిలో నివాళుల‌ర్పిస్తున్న సిపిఎం నాయ‌కులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ తాను నమ్మిన విలువలకు చివరివరకు కట్టుబడి ఉన్నారని, విచ్ఛిన్నకర శక్తులు, మతోన్మాదంపై రాజీలేని పోరాటం సాగించారని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో కొడియేరి బాలకృష్ణన్‌ సంతాప సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్‌ చిత్రపటానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, పట్టణ కార్యదర్శి డి.విమల, ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, నాయకులు ఎ.ప్రసాద్‌రావు, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు, టి.పెద్దిరాజు, పి.సూర్యప్రకాష్‌రావు, జి.రవిబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : కొడియేరి బాలకృష్ణన్‌కు సిపిఎం తాడేపల్లి మండల కమిటీ సంతాపం ప్రకటించింది. ఎంటిఎంసి పరిధిలోని వడ్డేశ్వరం ప్రజాసంఘాల కార్యాలయంలో బాలకృష్ణన్‌ చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు పూలమాలలేసి నివాళులర్పించారు. కేరళ రాష్ట్రంలో అనేక పోరాటాలు నడిపిన చరిత్ర బాలకృష్ణన్‌కు ఉందని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, కె.శివన్నారాయణ, కె.స్వాతి, కె.వెంకటయ్య, జె.రాంబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి కొడియేరి బాలకృష్ణన్‌ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో బాలకృష్ణన్‌ చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణన్‌ విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేసి, అనేక ఉద్యమాలు నడిపారని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో యువత సేవా కార్యక్రమాలలో, ప్రజా సమస్యలపై నిరతంరం పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి సుధీర్‌, నాయకులు అఖిల్‌, పూర్ణమహేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి.బాష తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ జెండాను అవనతం చేశారు. అనంతరం నిర్వహించిన సంతాప సభకు జి.నాగేంద్రుడు అధ్యక్షత వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు కె.హనుమంతరెడ్డి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలకృష్ణన్‌ మృతి సిపిఎంకు, కేరళ రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన పోరాటాలు అందరు ఆదర్శంగా తీసుకోవాలని, కేరళలో ఎల్‌డిఎఫ్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. సమావేశంలో ఎ.ఆంజనేయులు, పి.వెంకటప్పయ్య, షేక్‌ రంజాన్‌బి, ఎం.తిరుమలలక్ష్మీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - ముప్పాళ్ల : మండలంలోని నార్నెపాడులో సిపిఎం కార్యాల యంలో కొడియేరి బాలకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభ పాలూరి సీతారామిరెడ్డి అధ్యక్షత వహించారు. సిపిఎం మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. ఎన్‌.సాంబశివరావు, ఎం.నాగేశ్వ రరావు, ఐ.సాంబశివరావు, కె.ప్రభాకరరావు, డి.అప్పారావు, ఎన్‌.నాగేశ్వరరావు, వి.పెద్దిరెడ్డి, ఐ.శ్రీనివాసరావు, టి.మస్తాన్‌రావు, ఎన్‌.రామారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెపల్లి రూరల్‌ : మండలంలోని రెంటపాళ్లలో సంతాప సభ నిర్వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడారు. నాయకులు ఎం.నరసింహా రావు, భగత్‌, మేరీమాత, డి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.