Oct 03,2022 02:48
నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: సుదీర్ఘ ప్రజా పోరాటాల జీవితం, పోరాటాల్లో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్‌ నిర్వహించిన పాత్రను కేరళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నా రని బాపట్ల సీఐటీయూ నాయకులు అన్నారు. బాపట్లలోని సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన సంతాప కార్యక్రమం జరిగింది. ముందుగా బాలకృష్ణన్‌ చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు ఎన్‌ కోటేశ్వరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మజుందార్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ కొడియారి బాలకృష్ణన్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులుగాను, కేరళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాను విశేషమైన కృషి చేశారని వారి ఆశయ సాధనలో పార్టీ సభ్యులందరూ కూడా ముందుకు సాగాలని కోరారు. పార్టీ బాపట్ల పట్టణ కమిటీ సభ్యులు కుమార్‌, శ్రీనివాసరావు, భాస్కరరావు, సుభాని, ఆర్య పాల్గొన్నారు.