
వర్గ సమాజంలో... అధికారం
కలిమి కొడుకుల కాళ్ల కింద
చెప్పులా పడివుంటుంది
సకల పాలనా వ్యవస్థలు
బాంచన్ నీ కాల్మొక్కుతా
అనకపోతే దినం తీరదు
సమ న్యాయం సమాన ధర్మం
నేతి బీరలో ... నెయ్యి చందం ఇక్కడ
న్యాయ దేవతకు కళ్ళుండవంటారు
చెవులు కూడా... వుండవని తేలిపోయింది.
మేకల్లాంటి రైతుల గోడు
వినమని కసాయి కత్తికి పెత్తనం ఇచ్చింది
పులీ జింకల యుద్ధలో...
తోడేలు రాయబారం దేనికి సంకేతం..?
ఆత్మను అమ్ముకునే వ్యవస్థలున్న దేశంలో
ప్రజల అవస్థలకు పోరాటాలే పరిష్కారం!
- వి.రాజగోపాల్
94900 98036