Oct 18,2020 23:05

పాదయాత్రనుద్దేశించి మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

అగనంపూడి : విశాఖ ఉక్కు-ఆంధ్రులు హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం భూములను పోస్కోకి కట్టబెట్ట వద్దని కోరుతూ ఆదివారం సిఐటియు అగనంపూడి ఎరియా కమిటీ ఆధ్వర్యాన దిబ్బపాలెం గామంలో 'పొస్కో గో బ్యాక్‌' అంటూ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ అధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం భూములను ప్రయివేటు కంపెనీ పోస్కోకు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టంచేశారు. నిర్వాసితులు తమ భూములను ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి ఇచ్చారు తప్ప, విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు కాదన్నారు. మిగిలిన భూములను నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉరిటి మరిడయ్య, పి.నీలకంఠం, సిహెచ్‌.అబ్బాయి, యు.కన్నారావు, పట్టా రమేష్‌, ఉరిటి అప్పలరాజు, వంకర రాము, అంజనేయులు పాల్గొన్నారు.