Feb 08,2023 23:58

రికార్డులు పరిశీలిస్తున్న డాక్టర్‌ విజయమ్మ

ప్రజాశక్తి -కారంచేడు : మండల పరిధిలోని స్వర్ణప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని బాపట్ల జిల్లా డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ విజయమ్మ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వైద్యశాలలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలపై సమీక్షించారు. పిహెచ్‌సిలోని ల్యాబ్‌ రూమ్‌, గర్భిణుల పరీక్షల రిజిస్టర్స్‌ , యుఐపి సెషన్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం సచివాలయం-1 వద్ద గర్భిణుల రికార్డు నమోదు, ఇమ్మనైజేషన్‌ ఆర్‌సిహెచ్‌ పోర్టల్‌, ఆన్‌లైన్‌ యాప్‌లో వివరాల నమోదు తదితర అంశాలపై ఎఎన్‌ఎంలకు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్వర్ణప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఆరు బెడ్స్‌ ఉండే వార్డుని నిర్మించడానికి ప్రపోజల్స్‌ సిద్ధం చేయాలని సూచించారు. ఆపరేషన్‌ థియేటర్‌ కూడా సిద్ధం చేయాలన్నారు. నూతనంగా విధుల్లో చేరిన వైద్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయ సిబ్బంది ఎస్‌కెఎం. జానీ, ఎంపిహెచ్‌ఒ లక్ష్మీనారాయణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, పిహెచ్‌సి సిబ్బంది, డాక్టర్‌ ఎం. శాలిని, డాక్టర్‌ ప్రియ ,హెచ్‌ఇ మీనా కుమారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ బయ్య శంకర్‌ ,స్టాఫ్‌ నర్సులు మల్లేశ్వరి, క్షీరవర్ధిని, యుడిసి శాంతి లత, ఫార్మసిస్ట్‌ జ్యోత్స్న, ఎఎన్‌ఎం నాగలక్ష్మి, ఆశా వర్కర్లు బేబి, మరియమ్మ పాల్గొన్నారు.