Jun 23,2021 15:57

హైదరాబాద్‌ : బాహుబలి చిత్రంతో.. ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈయన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొనే కొన్ని వాణిజ్య కంపెనీలు సొమ్ము చేసుకోవాలని అనుకున్నాయట. అయితే హీరో ప్రభాస్‌ వాణిజ్య ప్రకటనలకు నిరాకరించారట. ఇలా ప్రభాస్‌ వాణిజ్య ప్రకటనల్లో నటించకపోవడం వల్ల 150 కోట్ల మేర నష్టపోయారని సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌చేస్తున్నాయి. అలాగే ప్రభాస్‌ కూడా తన అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఏ యాడ్‌లో పడితే ఆ యాడ్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నారని టాక్‌. ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదిపురుష్‌ చిత్రం, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్‌ షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.